Addanki: మంత్రి నారా లోకేష్ రాజీనామాకు అశోక్ కుమార్ డిమాండ్!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకిలో వైఎస్‌ఆర్‌సీపీ నేత చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

Kolla Singaiah, Addanki
Published on: 10 Aug 2026 11:49 PM IST
Addanki
X

Addanki: మంత్రి నారా లోకేష్ రాజీనామాకు అశోక్ కుమార్ డిమాండ్!

అద్దంకి: అద్దంకి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుండి బంగ్లా రోడ్ అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ లో వైసిపి శ్రేణులతో కలిసి చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. స్పోర్ట్స్ కేటగిరీ లో వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి అకాడెమీ పాల్గొన్న వారికి కేవలం పాల్గొన్నారు అనే ఒకే ఒక్క సాకు సర్టిఫికెట్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారాన్నారు .

మొట్టమొదటిసారి మన భారత దేశంలో ఎటువంటి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయకుండా సరాసరిగా ఇంటికే అపాయింట్ లెటర్ పంపిస్తున్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, దేశంలోనే ఎంతో వెనుకబడినటువంటి బీహార్ లాంటి రాష్ట్రాల్లో లేని విధంగా మన రాష్ట్రంలో ఆడబిడ్డలమీద అగయిత్యలు జరుగుతున్న పట్టించుకోవడం లేదన్నారు.

రాజమండ్రి లోని ఒక డాక్టర్ ను కారు తో గుద్ది చంపిన కానీ కేవలం నామమాత్రానికి ఇద్దరిని అరెస్ట్ చేయడం వాళ్లను నడిపించినటువంటి నాయకులను మాత్రం ఏమి చేయకుండా వదిలేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో నీ ఒక మినిస్టర్ మీద ఏదైతే ఆమె నోరు జారీ ఎదుటి ఎక్స్ మినిస్టర్ అన్నదో ఆయన తిరిగి మీరు మేకప్ వేసుకుంటారు ఎక్కడా లేనటువంటి తీరికతో చిన్న ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ముగ్గురు ట్విట్టర్ లో పగిలిపోయేలా ట్వీట్స్ వేస్తారు అని ఎద్దేవ చేశారు.

ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీ నోట్లో ఉస్తున్నారు అయిన మీకు చలనం లేదన్నారు. డీఎస్సీ మీద జరిగిన అక్రమాలపై వెంటనే స్పందించి , నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు, ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించలేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story