Chirala: చీరాలలో ఘనంగా జాబ్ మేళా.. ప్రారంభించిన ఎమ్మెల్యే!
Chirala: చీరాలలో ఉపాధ్యాయులపై దాడులు చేసిన వారిపై ఎమ్మెల్యే మాలకొండయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు.
Chirala: చీరాలలో ఘనంగా జాబ్ మేళా.. ప్రారంభించిన ఎమ్మెల్యే!
Chirala: గురువులపై విషం కక్కే గొడ్డలి పార్టీకి రాష్ట్ర ప్రజలే బుద్దిచెబుతారని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. డీఎస్సీ నియామకాల విషయంలో వైసీపీ సిగ్గుచేటుగా వ్యవహరిస్తుందన్నారు.
కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై కోడిగుడ్డులు,రాళ్లుతో దాడిచేసి వైసీపీ మహా పాపం మూటకట్టుకుందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇలాంటి పార్టీ దేశంలో ఎక్కుడా ఉండదన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నేడు ఉద్యోగాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వాన్ని విమర్చించడటం విడ్డురంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. జాబ్ మేళాలో మొత్తం 20 కంపెనీలు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహించాయి.




