Ongole: ఒంగోలు వైసీపీ మేయర్ అభ్యర్థిగా చుండూరి రవిబాబు పేరు పరిశీలన!
Ongole: ఒంగోలు నగర మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు బరిలోకి దిగనున్నట్లు ప్రచారం. వైఎస్ జగన్ ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం.
Ongole: ఒంగోలు వైసీపీ మేయర్ అభ్యర్థిగా చుండూరి రవిబాబు పేరు పరిశీలన!
Ongole: ఒంగోలు నగర మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ నేత, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు పేరు తెరపైకి వచ్చింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చుండూరి రవిబాబుకు ఫోన్ చేసి, మేయర్ రేసులో బరిలోకి దిగాలని సూచించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రవిబాబు మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, మేయర్ అభ్యర్థిత్వంపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీంతో ఒంగోలు వైఎస్సార్సీపీలో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.




