Singarayakonda: సింగరాయకొండలో తొమ్మిదో తరగతి విద్యార్థికి ప్రమాదం

Singarayakonda: సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గేట్ ఎదుట జరిగిన ఘర్షణలో 9వ తరగతి విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని హరిబాబు ఆసుపత్రికి తరలించారు.

Ram Mohan, Singarayakonda
Published on: 11 Nov 2026 5:55 PM IST
Singarayakonda
X

Singarayakonda: సింగరాయకొండలో తొమ్మిదో తరగతి విద్యార్థికి ప్రమాదం

ప్రకాశం జిల్లా: సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గేట్ ఎదుట 9వ తరగతి విద్యార్థులు గొడవపడ్డారు. ఈ గొడవలో ఒక బాలుడు అస్వస్థకు గురయ్యారు. విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు బాలుడిని హరిబాబు హాస్పిటల్ కు తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది..!

అయితే ఇది నిత్యం కాలేజ్ గోడల మీద కూర్చునే చిల్లరముకలు పెట్టిన గొడవ లేక విద్యార్థులు ఇద్దరు ఓకే క్లాస్ కనుక వారి మధ్య ఏర్పడిన గొడవ అనే విషయం తెలియాల్సి ఉంది..!

ఇప్పటికే పలుమార్లు సింగరాయకొండ గవర్నమెంట్ కాలేజ్ గోడలపై చిల్లరమూకలు కూర్చుని కాలేజీలకు, స్కూళ్లకు అటువైపుగా వెళ్లే బాలికలను మహిళలను ఇబ్బందులు గురిచేస్తు ఈవ్ టీజింగ్ గురిచేసిన సందర్భాలు ఎన్నో..!

దీనికి ప్రధాన కారణం సింగరాయకొండ లో పోలీస్ పహారా కొరబడిందనె స్థానికులు చెబుతున్నారు. నిత్యం ఈ చిల్లరమూకలు కాలేజీలకు స్కూళ్లకు వెళ్లే రోడ్లలో బైకులకు సైలెన్సర్లు విప్పుకొని స్టంట్ లు వేస్తూ వీరవిహారం చేస్తున్నది స్థానిక ప్రజలు గోలుపెడుతున్నారు.

అధికారులు చిల్లరమూకలపై ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోకపోతే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Ram Mohan, Singarayakonda

Ram Mohan, Singarayakonda