Markapuram: మలేరియా రహితంగా మార్కాపురం ప్రాంతం!

Markapuram: కలెక్టరేట్‌లో మలేరియా వ్యతిరేక మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ ఎం. విజయ సునీత.. జూన్ 1 నుండి 30 వరకు ప్రత్యేక కార్యాచరణ - న్యూస్ బై శ్రీనివాస్ యన్నం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 Jun 2026 9:01 PM IST
Markapuram
X

Markapuram: మలేరియా రహితంగా మార్కాపురం ప్రాంతం!

మార్కాపురం: మలేరియా రహిత జిల్లా నే లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం 'మలేరియా వ్యతిరేక మాసోత్సవాల పోస్టర్' ను అధికారులతో కలసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.

నెలరోజుల పాటు అన్ని శాఖల సహకారంతో దోమలు కుట్టకుండా చేయవలసిన కార్యక్రమాల గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ వసతి గృహల్లో ముందుగానే స్ప్రేయింగ్ చేయించాలన్నారు. దోమల వృద్ధి చెందకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. తొట్లు, డ్రమ్ములు, గంగాలా ల్లో ఎక్కువ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

గత సంవత్సరం మలేరియా కేసులు నమోదైన ప్రాంతాలైన దోర్నాల మండలం పెద్ద చామ, చిన్నారుట్ల, కర్రప్రోలు గ్రామాల్లో దోమల నివారణకు రెండు దశల్లో స్ప్రేయింగ్ చేనున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఎంహెచ్ఓ కే.రాహుల్, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి శీనయ్య, ఆర్ డబ్ల్యూ ఎస్ ఇన్చార్జ్ ఎస్ఈ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జ్యోతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story