Prakasam: ఎల్ నిన్యోపై కలెక్టర్ విజయ సునీత అలర్ట్
Prakasam: ఎల్ నిన్యో బెట్ట పరిస్థితులను తట్టుకునేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి.
Prakasam: ఎల్ నిన్యోపై కలెక్టర్ విజయ సునీత అలర్ట్
ప్రకాశం: ఈ సంవత్సరం ఎల్ నిన్యో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అన్నారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం 'ఎల్ నిన్యో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రైతులు వేయాల్సిన పంటలు, ప్రారంభించాల్సిన పద్ధతులకు సంబంధించి వ్యవసాయ శాఖ తయారు చేసిన పుస్తకాన్ని ఆ శాఖ అధికారులతో కలిసి ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో మొక్క దృఢంగా ఉండడంతోపాటు బెట్టను తట్టుకుంటుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కొంతమంది సిబ్బంది కేటాయించినట్లు వివరించారు. వీరు రైతులకు వివిధ రకాల కషాయాలు తయారు చేయడం, ఘన, జీవామృతాలు తయారు చేసే విధానం చూపిస్తారన్నారు.
దీర్ఘకాలిక పంటలు జోలికి వెళ్లకుండా పెసర, మినుము, సజ్జ, అలసంద వంటి పంటలు సాగు చేసుకుంటే రైతులు నష్టపోకుండా ఉంటారని వివరించారు. రసాయనాల వాడకం తగ్గిస్తే అన్ని పంటలకు బాగుంటుంది అని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ కె. ఐ. సుదర్శన్ రాజు, వ్యవసాయ శాఖ జిల్లా ఇన్చార్జి అధికారి బాలాజీ నాయక్, ఎర్రగొండపాలెం ఏ డి ఏ రమణ, ఇతర ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.




