Prakasam: పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల పనులకు కలెక్టర్ డెడ్‌లైన్!

Prakasam: వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల పనులను సెప్టెంబర్ లోగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 29 July 2026 11:27 PM IST
Prakasam
X

Prakasam: పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల పనులకు కలెక్టర్ డెడ్‌లైన్!

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల సౌకర్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, పునరావాస కాలనీల్లో వసతులు, పరిహారం పంపిణీలో నెలకొన్న పెండింగ్ అంశాలపై వెలుగొండ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు, డ్వామా, ఐసీడీఎస్, డీఆర్డీ ఏ అధికారుల తో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సెప్టెంబర్ లో ప్రాజెక్టును ప్రారంభించడానికి ప్రణాళిక లు రూపొందించిన నేపథ్యంలో ఆ దిశ గా అధికారులు అన్ని పనులు పూర్తి చేయాలని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ -1 టన్నెల్ -2 పనులు ఏ దశలో ఉన్నాయి వాటి పూర్తికి ఇంకా ఎంత సమయం పడుతుంది వంటి అంశాలను ఇంజనీరింగ్ అధికారులు అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ముఖ్యంగా పునరావాస కాలనీలో మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేయాలన్నారు.

దీని విషయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన సహించేది లేదని తేల్చి చెప్పారు. అదేవిధంగా పరిహారం నగదు పంపిణీ కి సంబంధించి ఎలాంటి పొరపాట్ల కు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఐసీడీఎస్, డ్వామా, డీఆర్ డీ ఏ అధికారుల సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా ఈ ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, వెలుగొండ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డ్వామా పీడీ సువార్త, ఐసీడీఎస్ ఇంచార్జి పీడీ పద్మావతి, డీఆర్ డీ ఏ పీడీ శివన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story