Markapuram: అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ విజయ సునీత ఫైర్!

Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి 238 అర్జీలు వచ్చాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 15 Jun 2026 4:14 PM IST
Markapuram
X

Markapuram: అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ విజయ సునీత ఫైర్!

మార్కాపురం: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీ జీ ఆర్ ఎస్ )కార్యక్రమానికి 238 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ కు సంబంధించి 159, ఇతర సమస్యలపై 79 అర్జీలు వచ్చాయని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ పిజిఆర్ఎస్ కార్యక్రమాల్లో రెవెన్యూ సంస్థలపైనే ఎక్కువ అర్జీలు వస్తున్నాయని వీటి పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం మంచి పద్ధతి కాదన్నారు. సాధ్యమైనంతవరకు పరిష్కారమయ్యే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.

అర్జీదారులను పదేపదే తిప్పుకోవడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదన్నారు. ఇకనుంచి పద్ధతి మార్చుకొని రెవెన్యూ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, కనిగిరి ఆర్ డి ఓ అజయ్ కుమార్, కంభం ఎస్ డి సి సత్యనారాయణ, హౌసింగ్ పీడీ మోహన్ రావు, జిల్లా మైనింగ్ అధికారి రవిప్రసాద్, జిల్లా రవాణా శాఖ అధికారి రాంబాబు, ఐసిడిఎస్ ఇంచార్జి పీడి పద్మావతి, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారి బాలాజీ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story