Kopperapadu: కొప్పెరపాడులో కలెక్టర్ రాజాబాబు తాగునీటి సమస్యలపై సమీక్ష!
Kopperapadu: ప్రకాశం జిల్లా జె పంగులూరు మండలం తూర్పు కొప్పెరపాడులో కలెక్టర్ రాజాబాబు పల్లెనిద్ర అనంతరం గ్రామ సమస్యలపై అధికారులతో సమీక్షించారు.
Kopperapadu: కొప్పెరపాడులో కలెక్టర్ రాజాబాబు తాగునీటి సమస్యలపై సమీక్ష!
Kopperapadu: పంగులూరు మండలం తూర్పు కొప్పెరపాడు సచివాలయంలో పల్లెనిద్ర కార్యక్రమం అనంతరం శుక్రవారం ఉదయం గ్రామంలో కలెక్టర్ రాజాబాబు పర్యటించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తొలుత పచ్చదనం పెంపొందించుటలో భాగంగా సచివాలయ ప్రాంగణంలో చెట్టు నాటి వాటర్ ట్యాంక్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
త్రాగునీటిని సాంకేతికంగా పరిశీలించారు..అనంతరం తూర్పు కొప్పెరపాడు ఎస్సీ కాలనీలో అంగన్వాడీ కార్యాలయం వద్ద డ్రైనేజీ ఇష్యూ విషయమై స్థానికులతో చర్చించి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మ్యాజిక్ డాన్స్ పథకం కింద ట్రైన్లు మరమ్మత్తులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
తదుపరి ఎస్సీ కాలనీలోని పలు ఇళ్లను సందర్శించి చెత్త కలెక్షన్,ఎఫ్ ఎస్ టి పి సెంటరు జి ఎస్ పనులు ఇరిగేషన్ కెనాల్ మరియు త్రాగునీటి సమస్య విషయాలను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ రాజాబాబు.




