Ongole: బస్సులోనే టెక్నాలజీ ట్రైనింగ్.. ప్రారంభించిన కలెక్టర్

Ongole: ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో 'ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్' మొబైల్ బస్సు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రారంభించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 25 May 2026 5:12 PM IST
Ongole
X

Ongole: బస్సులోనే టెక్నాలజీ ట్రైనింగ్.. ప్రారంభించిన కలెక్టర్

Ongole: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు అధునాతన సాంకేతిక కోర్సులను నేర్చుకోవాలని తద్వారా మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నూతన టెక్నాలజీ పై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ బస్సులో శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా బస్సులోనే శిక్షణ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతుందన్నారు.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్స్, సెన్సార్స్, 3d ప్రింటింగ్ వంటి వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 7 వ తరగతి నుంచి బీటెక్ విద్యార్థుల వరకు ఈ కోర్సులను నేర్చుకోవచ్చన్నారు. 26న కిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్, 27న ఎర్రగొండపాలెం లో, 29న గిద్దలూరులో, 30 వ తేదిన కనిగిరిలో మొత్తం 500 మందికి శిక్షణ ఇవ్వనున్నట్ల పేర్కొన్నారు. విద్యార్థులు ఈ ఆకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎస్. సుబ్బారావు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కంచిబాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story