Markapuram: వెలుగొండ పునరావాస గ్రామాల ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ
Markapuram: మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టు పునరావాస గ్రామాలైన గొట్టిపడియ, అక్కచెరువు తండా వాసులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.
Markapuram: వెలుగొండ పునరావాస గ్రామాల ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ
మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు పునరావాస గ్రామాలైన గొట్టిపడియ, అక్కచెరువు తండా గ్రామస్తులకు ఇళ్ల పట్టాలను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పంపిణీ చేశారు.
మార్కాపురం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్వాసితులకు పట్టాలను అందజేశారు. పునరావాస గ్రామాల్లో మిగిలిన వారందరికీ కూడా ప్రణాళిక ప్రకారం త్వరలో ఇళ్ల పట్టాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఇప్పటికే పునరావాస గ్రామాల ప్రజలకు ప్రభుత్వం రూ.768 కోట్ల పరిహారం అందజేసిందని, మిగిలిన వారికి కూడా త్వరలో పరిహారం అందిస్తామని వెల్లడించారు.
మూడు దశాబ్దాల వెలుగొండ కల సాకారం కానున్న వేళ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ విజయ సునీత పేర్కొన్నారు.




