Markapuram: మార్కాపురం జిల్లాలో 64 శాతం ముగిసిన ఓటరు సవరణ: కలెక్టర్!

Markapuram: మార్కాపురం జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) 64 శాతం పూర్తయిందని, పొదిలిలో ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు.

MADARVALI, MARKAPURAM
Published on: 7 July 2026 10:16 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం జిల్లాలో 64 శాతం ముగిసిన ఓటరు సవరణ: కలెక్టర్!

మార్కాపురం: మార్కాపురం జిల్లాలో సర్ 64 శాతం పూర్తి అయిందని మున్సిపాలిటీ, అర్బన్ ప్రాంతాలలో కొంత వెనుకబడి ఉందని మార్కాపురంజిల్లా కలెక్టర్ విజయ సునీత అన్నారు.

మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో సర్ కార్యక్రమం నిర్వహణపై ఆమె పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.

ఈ నెల 21న ముసాయిదా డ్రాప్ట్ లిస్ట్ ప్రకటించడం జరుగుతుందని అందులో మీ పేరు ఉండాలంటే తప్పనిసరిగా ఎనమ్యరేషన్ ఫాం తప్పసరిగా తిరిగి ఇవ్వాలని ఆమె కొరారు.

మీ ఇంటి దగ్గరికి వచ్చే బిఎల్ఓ లకు సహకరించాలని వారు అడిగే ఫొట్, ఆధార్ వంటివి జిరాక్స్ ఇవ్వాలని ఆమె తెలిపారు.

నూతనంగా వివాహమైన మహిళలలు తప్పనిసరిగా సర్ కార్యక్రమంలో పాల్గోని నమోదు చేయించుకొవాలని ఇప్పటికే మార్కాపురంజిల్లా మొత్తం 74 శాతం మ్యాపింగ్ పూర్తియినట్లు ఆమె తెలిపారు.

అర్హులైన ఒక్క ఓటు కుడా పొకుండా ఉండాలంటే తప్పనిసరిగా సర్ కార్యక్రమంలో పాల్గోనాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ,తహసీల్దారు,బిఎల్ఓలు, తదితరులు పాల్గోన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story