Tarla Padu: దొంగ హాజరు వేస్తే చర్యలు తప్పవు కలెక్టర్ విజయ సునీత హెచ్చరిక

Tarla Padu: మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత తర్లపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 18 Jun 2026 3:25 PM IST
Tarla Padu
X

Tarla Padu: దొంగ హాజరు వేస్తే చర్యలు తప్పవు కలెక్టర్ విజయ సునీత హెచ్చరిక

తర్లపాడు: మార్కాపురం జిల్లా తర్లపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కార్యాలయంలో సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. కలెక్టర్ ఎప్పుడు, ఏ కార్యాలయాన్ని తనిఖీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో విధులకు సక్రమంగా హాజరుకాని అధికారులు, సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

కార్యాలయాలకు రాకుండా హాజరు నమోదు చేస్తున్న వారిపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగుతోందని సమాచారం. కలెక్టర్ చేపడుతున్న వరుస ఆకస్మిక తనిఖీలు నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులకు తలనొప్పిగా మారగా, ప్రభుత్వ సేవల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story