Markapuram: ఎరువులు ఎక్కువ ధరలకు అమ్మితే జైలుకే!

Markapuram: మార్కాపురం జిల్లాలో ఎమ్మార్పీ (MRP) కంటే ఎక్కువ ధరలకు ఎరువులు విక్రయిస్తే డీలర్ల లైసెన్సులు రద్దు. క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ విజయ సునీత హెచ్చరిక.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 14 July 2026 11:55 AM IST
Markapuram
X

Markapuram: ఎరువులు ఎక్కువ ధరలకు అమ్మితే జైలుకే!

Markapuram: మార్కాపురం జిల్లా రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ (MRP) కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయించే డీలర్లు, దుకాణదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత హెచ్చరించారు.

సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఖరీఫ్ సాగు సీజన్‌లో జిల్లాలో రైతులకు ఎరువుల కొరత లేకుండా తగిన నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలు నిర్వహించాలని, ప్రతి విక్రయాన్ని తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాలని డీలర్లకు ఆదేశించారు.

ఎరువులతో పాటు రైతులకు అవసరం లేని ఇతర ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయించాలని ఒత్తిడి చేసినా, ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేసినా సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కనిగిరి, గిద్దలూరు, పెద్దారవీడు ప్రాంతాల్లో కొంతమంది రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని పేర్కొన్న కలెక్టర్, వెంటనే అలాంటి అక్రమాలను నిలిపివేసి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం మాత్రమే యాప్ ద్వారా విక్రయాలు చేపట్టాలని హెచ్చరించారు.

ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత సృష్టించడం, ఎమ్మార్పీకి మించి విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి అక్రమాలు గమనించినా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story