Addanki: చైర్‌పర్సన్ స్థానానికి 17, వార్డు సభ్యులకు 196 నామినేషన్లు దాఖలు!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వివరాలను కమిషనర్ డి.రవీంద్ర వెల్లడించారు. 196 వార్డు నామినేషన్లు, చైర్‌పర్సన్ స్థానానికి 17 నామినేషన్లు దాఖలయ్యాయి.

Kolla Singaiah, Addanki
Published on: 19 Oct 2026 6:19 AM IST
Addanki
X

Addanki: చైర్‌పర్సన్ స్థానానికి 17, వార్డు సభ్యులకు 196 నామినేషన్లు దాఖలు!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపల్ ఎన్నికలు నామినేషన్ల వివరాలు మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర వెల్లడించారు మూడు రోజుల్లో 196 వార్డు సభ్యుల నామినేషన్లు.. చైర్‌పర్సన్‌కు 17 మంది నామినేషన్ దాఖలు చేశారన్నారు. అద్దంకి మున్సిపాలిటీలో మూడు రోజులుగా ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగిందని తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ల స్వీకరణ జరిగిందన్నారు.అద్దంకి మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులకు 49 పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు జరగనున్నాయి.

నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22న అవకాశం ఉంది.ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు.తుది అభ్యర్థుల జాబితా ఆధారంగా బ్యాలెట్ పేపర్ల రూపకల్పన నిర్ణయించడం జరుగుతుందన్నారు.అనంతరం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అద్దంకి మునిసిపాలిటీ లో చైర్‌పర్సన్ అభ్యర్థుల పార్టీ వారీ వివరాలు.

సిపిఐ పార్టీ – 1

టీడీపీ – 6

వైఎస్సార్‌సీపీ – 7

స్వతంత్ర అభ్యర్థులు – 3

మొత్తం అభ్యర్థులు – 17

అద్దంకి పట్టడంలోని 32 వార్డు సభ్యుల నామినేషన్ల వివరాలు

బీజేపీ – 2

సీపీఐ – 1

కాంగ్రెస్ పార్టీ 1

తెలుగుదేశం పార్టీ – 92

వైఎస్సార్‌సీపీ – 85

జనసేన – 11

స్వతంత్ర అభ్యర్థులు – 4

మొత్తం సభ్యుల – 196. నామినేషన్ దాఖలు చేసి ఉన్నారని తెలిపారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki