Markapuram: భూమి ఆక్రమణ.. వీఆర్వోపై మార్కాపురం కలెక్టర్‌కు ఫిర్యాదు!

Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో వీఆర్వో బడేసాబ్‌పై భారీ భూ అక్రమాల ఆరోపణలు వచ్చాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 3 Aug 2026 5:08 PM IST
Markapuram
X

Markapuram: భూమి ఆక్రమణ.. వీఆర్వోపై మార్కాపురం కలెక్టర్‌కు ఫిర్యాదు!

మార్కాపురం జిల్లా: మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో స్థానికుడు అబ్దుల్ గఫార్ జిల్లా కలెక్టర్ ఎం. విజయసునీతకు వినతిపత్రం సమర్పించారు.

గత 15 ఏళ్లుగా రెవెన్యూ సంబంధిత సమస్యలపై పోరాటం చేస్తున్నానని పేర్కొన్న ఆయన, సర్వే నంబర్లు 345, 346, 347లకు సంబంధించిన భూముల్లో అక్రమ ఆన్‌లైన్ నమోదు జరిగిందని ఆరోపించారు. అలాగే వీఆర్వో బడేసాబ్ 150 ఎకరాల భూమిని ఆక్రమించారని, తరిమడుగు గ్రామంలో నకిలీ పట్టా పాస్‌పుస్తకాలు సృష్టించి భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరారు.

ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, భూమి వద్దకు వెళ్లిన ప్రతిసారి కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని అబ్దుల్ గఫార్ వినతిపత్రంలో పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో నిష్పాక్షికంగా విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story