Markapuram: మార్కాపురం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం!

Markapuram: మార్కాపురం జిల్లాలో 20 మండలాలకు సంబంధించి 3 కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పరిశీలన.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 7 Nov 2026 8:34 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం!

Markapuram: మార్కాపురం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మార్కాపురం, కనిగిరి, కంభంలోని కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు.

జిల్లాలోని 20 మండలాలకు సంబంధించి మూడు కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 746 పోలింగ్ కేంద్రాలకు 132 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసి, 772 మంది సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM