Markapuram: వెలిగొండ నిర్వాసిత యువతకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి!
Markapuram: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని మార్కాపురం సీపీఎం సమావేశం.
Markapuram: వెలిగొండ నిర్వాసిత యువతకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి!
మార్కాపురం: మార్కాపురంలో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యురాలు డి. రమాదేవి మాట్లాడుతూ, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో 2026 జూలై నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులందరినీ ప్రత్యేక కుటుంబాలుగా గుర్తించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టు పూర్తి చేసి నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే రాష్ట్రంలో కుల వివక్ష నిర్మూలనకు ఉద్యమాలను బలోపేతం చేయాలని, మార్కాపురంలోని దేవాదాయ భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించి సుందరయ్య కాలనీలో మంచినీరు, మౌలిక వసతులు, పాఠశాల నిర్మాణం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story




