Kanigiri: కనిగిరిలో దద్దాల కీలక భేటీ.. లోకల్ పోరుపై మాస్టర్ ప్లాన్!
Kanigiri: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వెలిగండ్లలో కనిగిరి వైయస్ఆర్సీపీ ఇన్-ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు.
Kanigiri: కనిగిరిలో దద్దాల కీలక భేటీ.. లోకల్ పోరుపై మాస్టర్ ప్లాన్!
Kanigiri: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కనిగిరి నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. సోమవారం వెలిగండ్ల మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
అనంతరం దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, కష్టకాలంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ప్రతి ఒక్కరి సేవలను ఎప్పటికీ మరువలేమని తెలిపారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామ,బూత్ స్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా స్పందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రతి కార్యకర్త ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని దద్దాల నారాయణ యాదవ్ కోరారు. రాబోయే రోజుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి ప్రజల పక్షాన బలమైన గొంతుకగా నిలవాలని అన్నారు..
ఈ సమావేశంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు,జెడ్పీటీసీ గుంటక తిరుపతి రెడ్డి, వెలిగండ్ల మండల పార్టీ కన్వినర్ గజ్జల వెంకటరెడ్డి, మారం వెంకటేశ్వరరెడ్డి, ఎలిక నారాయణ, కుప్పనబోయిన వెంకటరమణయ్య, పొల్లా సుబ్రహ్మణ్యం, గంజి రవీంద్ర రెడ్డి, ఆవుల తిరుపతి రెడ్డి, దాదా సోమయ్య, పెరుగు తిరుపాలు యాదవ్, అయినకోట వెంకట రంగయ్య, గజ్జల నారాయణ స్వామి, సూరబోయిన గురుప్రసాద్, స్టాండ్లీ, కమల్ వలి, కొండలరావు, బాలుడు పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..




