Giddalur: దద్దవాడ సచివాలయం ఘటనను రాజకీయం చేయొద్దు: జడ్పీటీసీ!
Giddalur: నియోజకవర్గంలో కొమరోలు మండలం దద్దవాడ సచివాలయ ఘటనపై కుర్రా శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను గిద్దలూరు యాదవ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.
Giddalur: దద్దవాడ సచివాలయం ఘటనను రాజకీయం చేయొద్దు: జడ్పీటీసీ!
గిద్దలూరు: కొమరోలు మండలం, దద్దవాడ పంచాయతీ సచివాలయంలో జరిగిన వాస్తవాలను తెలుసుకోకుండా కుర్రా శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ లో అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని గిద్దలూరు నియోజకవర్గ యాదవ సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక అధికారికి, వ్యక్తులకు జరిగిన సంఘటనను కులాల మధ్య జరిగిన గొడవగా చిత్రికరించటం సరైన పద్దతి కాదని, అదే విధంగా గిద్దలూరు నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికీ తెలుగుదేశం ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డీ నాయకత్వంలో సముచిత స్థానం కల్పించటం జరిగిందని, మార్కెట్ యార్డ్ చైర్మన్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్, సొసైటీ బ్యాంకు చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీలో అనేక కీలక పదవుల్లో యాదవులను నియమించిన నాయకులు ముత్తుముల అశోక్ రెడ్డీ అని గుర్తు చేశారు.
నియోజకవర్గంలో యాదవులు ఏ పదవుల్లో ఉన్నారో కూడా తెలియని కుర్రా శ్రీనివాస్ రాజకీయ లబ్ధికోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని, గిద్దలూరు నియోజకవర్గంలోని మెజార్టీ యాదవులంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని అశోక్ రెడ్డీ నాయకత్వంలో సముచిత స్థానాల్లో కొనసాగుతున్నామని, ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చు పెట్టొద్దని, యాదవ సంఘం ముసుగు తీస్తే కుర్రా శ్రీనివాస్ అసలు రంగు బయట పడుతుందన్నారు. కుర్రా శ్రీనివాస్ చెబితే గిద్దలూరు నియోజకవర్గంలో ఒక్క యాదవుడు కూడా పలికే పరిస్థితుల్లో లేరని, అలాంటిది అయన 2029 ఎన్నికలను ప్రభావితం చేస్తానని చెప్పటం హాస్యాస్పదమన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో యాదవులకు అన్యాయం జరిగేతే ఇక్కడ యాదవులు అండగా ఉంటారని, ఇతర ప్రాంతాల నుండి ఇక్కడకు రావాల్సిన పని లేదని కుర్రా శ్రీనివాస్ ను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు జడ్పీటీసీ బుడతా మధుసూదన్ యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, టిడిపి సీనియర్ నాయకులు గుంటక కొండయ్య యాదవ్, కొమరోలు మండల పార్టీ అధ్యక్షుడు బొనేని వెంకటేశ్వర్లు యాదవ్, ఓ. వెంకటయ్య యాదవ్, బిల్లా రమేష్ యాదవ్, బూనబోయిన చంద్రశేఖర్ యాదవ్, క్లస్టర్ ఇంచార్జ్ చెన్నబోయిన రామకృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్ భోదనబోయినన గోపాలకృష్ణ యాదవ్, పాముల వెంకటరమణ యాదవ్, మాజీ కౌన్సిలర్ దేమా శ్రీరాములు యాదవ్, మాజీ నియోజకవర్గ TNSF అధ్యక్షులు బొర్రా రాఘవేంద్ర యాదవ్, కటారు రాజు యాదవ్, రాజశేఖర్ యాదవ్, బొంతా లక్ష్మిదేవి, వెళుతుర్ల మల్లీశ్వరి తదితర యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.




