Vetapalem: వేటపాలెం కుందేరు-బైపాస్ రోడ్డులో వీధి దీపాలు ఏర్పాటు చేయాలి!
Vetapalem: బాపట్ల జిల్లా వేటపాలెం కుందేరు నుంచి బైపాస్ రోడ్డు వరకు వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బందులు.. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు.
Vetapalem: వేటపాలెం కుందేరు-బైపాస్ రోడ్డులో వీధి దీపాలు ఏర్పాటు చేయాలి!
Vetapalem: వేటపాలెం కుందేరు నుండి వేటపాలెం బైపాస్ రోడ్డు వరకు గల ప్రధాన మార్గంలో వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యపై గతంలో పలు సందర్భాల్లో పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ, నేటికీ అక్కడ వీధి దీపాల ఏర్పాటు జరగకపోవడం ఆందోళనకరం. రాత్రి వేళల్లో ఈ మార్గం పూర్తిగా చీకటిమయంగా ఉండటంతో ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు గాయపడటంతో పాటు కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను అధికారులు అత్యవసరంగా పరిగణించి, వీలైనంత త్వరగా కుందేరు నుండి బైపాస్ రోడ్డు వరకు అవసరమైన వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.
ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ సమస్యపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాను.




