Markapuram: మార్కాపురంలో డీజిల్ కొరత.. వాహనదారుల బారులు

Markapuram: మార్కాపురం పట్టణంలో డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. పెట్రోల్ బంకుల్లో నిల్వలు లేక వాహనదారులు గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 25 April 2026 3:25 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో డీజిల్ కొరత.. వాహనదారుల బారులు

Markapuram: మార్కాపురం జిల్లా కేంద్రంలో డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. మార్కాపురం పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, వ్యవసాయ వాహనాలు డీజిల్ కోసం గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ పూర్తిగా అయిపోవడంతో “డీజిల్ లేదు” అనే బోర్డులు పెట్టి తాత్కాలికంగా మూసివేశారు. దీంతో మిగిలిన బంకుల వద్ద భారీగా వాహనాలు చేరి పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు.

డీజిల్ సరఫరాలో అంతరాయం కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నట్లు బంకు నిర్వాహకులు చెబుతున్నారు. సరఫరా త్వరగా పునరుద్ధరించాలని, లేదంటే రవాణా వ్యవస్థతో పాటు వ్యవసాయ పనులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు వెంటనే స్పందించి డీజిల్ సరఫరా సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story