Chimakurthy: చీమకుర్తి మున్సిపాలిటీ కూటమిలో వార్డుల రగడ!

Chimakurthy: ప్రకాశం జిల్లా చీమకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య వార్డుల కేటాయింపుపై వివాదం చెలరేగింది.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 17 Oct 2026 10:51 AM IST
Chimakurthy
X

Chimakurthy: చీమకుర్తి మున్సిపాలిటీ కూటమిలో వార్డుల రగడ!

Chimakurthy: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని చీమకుర్తి మున్సిపాలిటీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య వార్డుల పంపకాల అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

చీమకుర్తి మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా, టీడీపీ, జనసేన, బీజేపీలకు ఎన్ని వార్డులు కేటాయించాలనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత రాత్రి జనసేన నాయకులు సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు, వాట్సాప్ గ్రూపులు, స్టేటస్‌లలో హల్‌చల్ చేయడంతో కూటమిలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయనే ప్రచారం ఊపందుకుంది.

మున్సిపల్ ఎన్నికల వేళ వార్డుల కేటాయింపుపై నెలకొన్న అనిశ్చితి కూటమి రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సమస్యను పట్టణ స్థాయి పార్టీ నాయకులు ఎలా పరిష్కరిస్తారు…? నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతారా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కూటమి పార్టీల మధ్య నెలకొన్న ఈ పరిస్థితికి నాయకత్వం ఎలాంటి పరిష్కారం చూపుతుందోనని చీమకుర్తి మున్సిపాలిటీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam