Markapuram: మార్కాపురంలో కలెక్టర్ విజయ సునీత ఆకస్మిక తనిఖీలు!

Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పట్టణంలో సుడిగాలి పర్యటన చేపట్టారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 14 May 2026 3:40 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో కలెక్టర్ విజయ సునీత ఆకస్మిక తనిఖీలు!

మార్కాపురం: మార్కాపురం పట్టణంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గురువారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించి ప్రభుత్వ సేవల అమలు తీరును పరిశీలించారు. మొదటగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అన్నక్యాంటీన్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ భోజనం చేస్తున్న ప్రజలకు స్వయంగా వడ్డిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు.

అందిస్తున్న ఆహారం నాణ్యత, రుచి, శుభ్రత ఎలా ఉన్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్‌లో పరిశుభ్రత పాటిస్తూ నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం జనగణన తొలి దశలో భాగంగా జరుగుతున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరిస్తున్న ఎన్యుమరేటర్ల పనితీరును పరిశీలించి, ఎటువంటి పొరపాట్లు లేకుండా జనగణన నిర్వహించాలని సూచించారు. ప్రజలు పూర్తి వివరాలు అందజేసి జనగణన సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు.

తదుపరి మార్కాపురం పట్టణ శివారులో ఉన్న డంపింగ్ యార్డ్‌ను కలెక్టర్ ఎం. విజయ సునీత మున్సిపల్ కమిషనర్ నారాయణరావుతో కలిసి పరిశీలించారు. చెత్త శుద్ధి ప్రక్రియ, నిర్వహణ విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.చెత్త నుంచి సంపద సృష్టించే విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story