Yerragondapalem: ఎర్రగొండపాలెం నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్!
Yerragondapalem: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ తనిఖీ చేశారు.
Yerragondapalem: ఎర్రగొండపాలెం నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్!
Yerragondapalem: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ తనిఖీ చేశారు. కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నామినేషన్ ప్రక్రియ సజావుగా, త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులను మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే వారిని బయటకు పంపించాలని ఆదేశించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) ప్రకారం పోలీసులు విధులు నిర్వర్తించాలని, ప్రజలు గుంపులుగా చేరకుండా చూడాలని సూచించారు. నామినేషన్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఎస్పీబీ సీఐ మధుబాబుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




