Markapur: తర్లుపాడులో దీపావళి వేడుకలు.. వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు
Markapur: మార్కాపురం జిల్లా తర్లుపాడులోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో వైభవంగా దీపావళి పూజలు. బాసు కుటుంబాల ఉభయదాతృత్వంలో ప్రత్యేక సేవలు.
Markapur: తర్లుపాడులో దీపావళి వేడుకలు.. వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు
మార్కాపూర్: మార్కాపురం జిల్లా తర్లుపాడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో దీపావళి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. జనమేజయ మహారాజు ప్రతిష్ఠించిన పురాతన ఆలయంలో సత్యభామ అమ్మవారు కొలువై ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకతగా నిలుస్తోంది.
నరకాసురుడిని సత్యభామ అమ్మవారు సంహరించిన విజయానికి ప్రతీకగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం తీర్థపు బిందె కార్యక్రమంతో ప్రారంభమైన వేడుకల్లో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి, విశేషంగా అలంకరించారు. అనంతరం అష్టోత్తర శతనామావళి పూజలు, నైవేద్యం, మహా మంగళహారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహించారు. చివరగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఉభయదాతలుగా బాసు కుటుంబాలు.. ఈ దీపావళి మహోత్సవాలకు ఉభయదాతలుగా బాసు పాపిరెడ్డి–లక్ష్మమ్మ కుమారులు బాసు వెంకటేశ్వరరెడ్డి–కృష్ణవేణి ,బాసు రమేష్‌రెడ్డి–కృష్ణవేణి వారి సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.




