Pedda Dornala: పెద్దదోర్నాల హైవేపై ప్రమాదం శ్రీశైలం భక్తుల కారు బోల్తా!

Pedda Dornala: పెద్దదోర్నాల హైవేపై అదుపుతప్పి బోల్తాపడిన భక్తుల కారు. శ్రీశైలం మల్లన్న దర్శనం ముగించుకుని భద్రాచలం వెళ్తుండగా ప్రమాదం, ఒకరికి గాయాలు.

Srikanth Singam, Markapur
Published on: 7 July 2026 10:45 AM IST
Pedda Dornala
X

Pedda Dornala: పెద్దదోర్నాల హైవేపై ప్రమాదం శ్రీశైలం భక్తుల కారు బోల్తా!

పెద్దదోర్నాల: పెద్దదోర్నాల హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం నుండి భద్రాచలం వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో భద్రాచలానికి చెందిన రాము అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో మొత్తం నలుగురు ప్రయాణిస్తుండగా, గాయపడిన రామును 108 అంబులెన్స్‌లో పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎదురుగా వస్తున్న మరో కారును తప్పించబోయే క్రమంలో తమ వాహనం అదుపుతప్పి బోల్తాపడినట్లు కారులో ప్రయాణిస్తున్న రాము తెలిపారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story