Dornala: చెంచుగూడెంలో పల్స్ పోలియోను ప్రారంభించిన ఐటీడీఏ పీవో

Dornala: పెద్దదోర్నాల మండలం చింతల చెంచుగూడెంలో ఐటీడీఏ పీవో పి.వి.ఎస్. నాయుడు పల్స్ పోలియోను ప్రారంభించి, 50 మంది చెంచు చిన్నారులకు చుక్కలు వేయించారు.

Srikanth Singam, Markapur
Published on: 28 Jun 2026 7:01 PM IST
Dornala
X

Dornala: చెంచుగూడెంలో పల్స్ పోలియోను ప్రారంభించిన ఐటీడీఏ పీవో

దోర్నాల: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని చింతల చెంచుగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్. నాయుడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులందరూ తమ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో చుక్కలు వేయించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే అనర్థాల గురించి చెంచు ప్రజలకు వివరించారు. ప్రతి చిన్నారి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం "నిండు జీవితానికి రెండు చుక్కలు" అనే సందేశాన్ని అందరూ పాటించాలని పిలుపునిచ్చారు.

గూడెంలోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులు డాక్టర్ ఎం. యాగ్నిక్, డాక్టర్ కె. దివ్యశ్రీలకు సూచించారు. అనంతరం 50 మంది చెంచు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.

తదుపరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన నమోదుపుస్తకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ టి. రవి, జాతీయ ఆరోగ్య కార్యక్రమ అధికారి బి. పరమేష్, ఆరోగ్య కార్యకర్త నసీమున్, పర్యవేక్షకురాలు పద్మావతి, కమ్యూనిటీ ఆరోగ్య అధికారి హబీబ్ ఖాన్, ప్రయోగశాల సాంకేతిక నిపుణుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అనంతరం చింతల చెంచుగూడెంలోని ఐటీడీఏ కార్యాలయం ద్వారా ఓ చెంచు రైతుకు మంజూరైన వ్యవసాయ బోరును ప్రాజెక్టు అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story