Dornala: ఆటోను ఢీకొన్న టూరిస్ట్ బస్సు - నలుగురికి తీవ్ర గాయాలు
Dornala: పెద్ద దోర్నాల ఔటర్ బైపాస్‌లో టూరిస్ట్ బస్సు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఎగువ చెర్లోపల్లికి చెందిన నలుగురు మహిళలు గాయపడ్డారు.
Dornala: ఆటోను ఢీకొన్న టూరిస్ట్ బస్సు - నలుగురికి తీవ్ర గాయాలు
దోర్నాల: పెద్ద దోర్నాలలోని ఔటర్ బైపాస్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎగువ చెర్లోపల్లి నుంచి దోర్నాల వైపు ప్రయాణిస్తున్న ఆటోను టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎగువ చెర్లోపల్లి గ్రామానికి చెందిన మర్రియమ్మ (45), ఎస్తేర్ (30), ఎం. మరియమ్మ (68), పి. నవమ్మ (50) గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.
Next Story




