Markapuram: మార్కాపురం జిల్లాలో విద్యాసంస్థల బస్సుల భద్రతలో రాజీ లేదు

Markapuram: మార్కాపురం జిల్లాలో విద్యాసంస్థల బస్సుల భద్రతపై జిల్లా రవాణా అధికారి (DTO) సి. రాంబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 2 May 2026 4:25 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం జిల్లాలో విద్యాసంస్థల బస్సుల భద్రతలో రాజీ లేదు

మార్కాపురం జిల్లా: విద్యాసంస్థల బస్సుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని జిల్లా రవాణా అధికారి (DTO) సి. రాంబాబు స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అన్ని విద్యాసంస్థల బస్సులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు.బస్సులకు ATS ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి అని పేర్కొన్న ఆయన, ప్రతి వాహనంలో స్పీడ్ గవర్నర్లు,ఫస్ట్ ఎయిడ్ కిట్ ,ఫైర్ సేఫ్టీ పరికరాలు,ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీవోలు రామచంద్రరావు, భాస్కరరావు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story