Gokavaram: ఓట్ల కోసం వస్తారు.. సమస్యలు పట్టించుకోరుకొత్తపల్లి ప్రజల ఆగ్రహం
Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జి.కొత్తపల్లి గ్రామంలో స్మశాన వాటిక దుస్థితిపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Gokavaram: ఓట్ల కోసం వస్తారు.. సమస్యలు పట్టించుకోరుకొత్తపల్లి ప్రజల ఆగ్రహం
గోకవరం: గోకవరం మండలం జి.కొత్తపల్లి గ్రామంలో స్మశాన వాటిక మొత్తం అధ్వానంగా మారింది. గ్రామపంచాయతీకి అతి చేరువలో ఉన్న ఈ స్మశాన వాటికను పట్టించుకునే నాధుడే కరువయ్యారంటూ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఆ స్మశాన వాటిక లోకి వెళ్లే మార్గంలో తుప్పలు పేరుకుపోవడంతో అక్కడ కార్యక్రమాలు నిర్వహించేందుకు గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
వర్షం పడితే ఆ స్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో కార్యక్రమాల నిర్వహణకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ స్మశాన వాటిక విషయంలో గ్రామ ప్రజలు ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నా అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులు వచ్చినప్పుడు వారి మెప్పుకోసం స్థానిక అధికారులు, ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు కోసం ప్రజా ప్రతినిధులు హడావుడి చేస్తున్నారే తప్ప గ్రామ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటే గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి గ్రామ సమస్యల పై దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.




