Santanuthalapadu: మైనంపాడులో ఆకట్టుకుంటున్న మట్టి వినాయకుని ఉత్సవాలు!

Santanuthalapadu: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులో ఘనంగా జరుగుతున్న మట్టి వినాయకుని ఉత్సవ వేడుకలు.. ఆకట్టుకుంటున్న పర్యావరణ పరిరక్షణ సందేశం.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 15 Sept 2026 3:57 PM IST
Santanuthalapadu
X

Santanuthalapadu: మైనంపాడులో ఆకట్టుకుంటున్న మట్టి వినాయకుని ఉత్సవాలు!

Santanuthalapadu: సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలోని రాములవారి దేవాలయ ప్రాంగణంలో ఘనంగా జరుగుచున్న మట్టి వినాయకుని ఉత్సవ వేడుకలు పలువురిని ఆకట్టుకొనుచున్నవి.

రాముల వారి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం, సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుతూ మట్టి వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భక్తులు, గ్రామస్తులను, ఈ వేడుకలు విశేషంగా ఆకట్టుకున్నవి.

మట్టి వినాయకుడిని డిజైన్ చేసిన యువకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

అర్చకులు వై. గిరి పంతులు ఆధ్వర్యంలో నిర్వాహకులు పర్యవేక్షణలో మట్టి వినాయకుని విగ్రహ పూజా వేడుకలు ఘనంగా జరుగుచున్నవి. భక్తులు విశేషంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam