Addanki: కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ సామగ్రి పంపిణీ!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్ కు సిద్ధమైన అధికారులు. 32 వార్డుల్లోని 49 పోలింగ్ కేంద్రాలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్సుల తరలింపు.
Addanki: కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ సామగ్రి పంపిణీ!
Addanki: అద్దంకి పట్టణంలో మునిసిపల్ ఎన్నికలు పోలింగ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అద్దంకి పట్టణంలోని 32 వార్డుల కు చెందిన 49 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు, శనివారం ఉదయం కట్టుదిట్టమైన పోలీస్ భద్రత సిబ్బంది మధ్య ఎన్నికలకు సంబంధించిన వాహనాల్లో తరలించారు.
ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిస్పక్ష పాతంగా పారదర్శకంగా వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని పోలీస్ మరియు ఎన్నికల అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.




