Markapuram: తర్లుపాడు రోడ్డులో ఘోరం.. విద్యుత్ శాఖ కార్యాలయంలో ప్రమాదం
Markapuram: విద్యుత్ శాఖ కార్యాలయంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై టెక్నీషియన్ భీమనబోయిన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి
Markapuram: తర్లుపాడు రోడ్డులో ఘోరం.. విద్యుత్ శాఖ కార్యాలయంలో ప్రమాదం
మార్కాపురం: జిల్లా కేంద్రంలోని మార్కాపురం–తర్లుపాడు రోడ్డులో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
ట్రాన్స్‌ఫార్మర్‌లకు మరమ్మత్తులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురైన టెక్నీషియన్ భీమనబోయిన వెంకటేశ్వర్లు (30) అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
విధి నిర్వహణలో ఉండగానే యువ టెక్నీషియన్ మృతి చెందడంతో సహోద్యోగులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.




