Markapuram: మార్కాపురం చెన్నకేశవస్వామి ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు

Markapuram: మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ చర్యలు వేగవంతం చేసింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 25 July 2026 7:08 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం చెన్నకేశవస్వామి ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు

Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయానికి చెందిన భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈవో) గొలమారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేవాదాయ శాఖకు చెందిన కొన్ని భూములు అక్రమ ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని తిరిగి దేవాలయ ఆధీనంలోకి తీసుకురావడానికి అధికారులు చట్టపరమైన చర్యలు వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొంత భూమిని దేవుని పేరుపై రిజిస్ట్రేషన్ పూర్తి చేశామని, మిగిలిన భూములను కూడా దశలవారీగా స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

ఆలయ ఆస్తుల పరిరక్షణ ప్రతి భక్తుడి బాధ్యత అని పేర్కొంటూ, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు, భక్తులు సహకరించాలని ఆయన కోరారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story