Addanki: కాకానిపాలెంలో వైభవంగా ‘ఏరువాక పౌర్ణమి’ వేడుకలు!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కాకానిపాలెంలో కాకతీయ సేవాసమితి, సింగరకొండ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను రైతులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు
Addanki: కాకానిపాలెంలో వైభవంగా ‘ఏరువాక పౌర్ణమి’ వేడుకలు!
అద్దంకి: తెలుగు రైతాంగ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఏరువాక పౌర్ణమి వేడుకలను కాకతీయ సేవాసమితి, సింగరకొండ ఆధ్వర్యంలో సోమవారం కాకానిపాలెం సచివాలయం ప్రక్కన ఉన్న పొలంలో ఘనంగా రైతులు నిర్వహించారు.
సంప్రదాయబద్ధంగా ఎద్దులకు, నాగలికి పసుపు, కుంకుమలతో అలంకరించారు.నాగలికి హలపూజ చేసి, ఏరువాక సాగిస్తూ దుక్కి దున్ని నూతన వ్యవసాయ సంవత్సరానికి రైతులు శ్రీకారం చుట్టారు.
ఏరువాక పౌర్ణమి రైతు సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక తొలకరి వర్షాల ఆగమనాన్ని స్వాగతిస్తూ భూమాతకు, ఎద్దులకు, వ్యవసాయ పనిముట్లకు జరుపుకునే పండుగ అన్నారు.
మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకట కృష్ణ మాట్లాడుతూ, రైతులు సంప్రదాయ వ్యవసాయ విధానాలతో పాటు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను కూడా అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.
ఏరువాక పౌర్ణమి వంటి పండుగలు రైతాంగ సంస్కృతిని, వ్యవసాయ సంప్రదాయాలను పరిరక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.




