Prakasam: నకిలీ ఏసీబీ డీఎస్పీ ఘరానా మోసం

Prakasam: వీఆర్వో యేసయ్యను బెదిరించి రూ.1,50,000 ఫోన్ పే ద్వారా స్వాహా.. ఎమ్మార్వో రవి నాయక్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ కేసు నమోదు.

Kolla Singaiah, Addanki
Published on: 1 Jun 2026 7:48 PM IST
Prakasam
X

Prakasam: నకిలీ ఏసీబీ డీఎస్పీ ఘరానా మోసం

ప్రకాశం: బల్లికురవ... మే నెల 30 వ తేదీన ఉదయం ఏసీబీ డీఎస్పీ అని ఒక గుర్తు తెలియని వ్యక్తి బల్లికురవ మండలంలోని రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కొంతమంది వీఆర్వోలకు ఫోన్ కాల్ చేసి, వారు అవినీతికి పాల్పడినట్లు, వారిని అరెస్ట్ చేయటానికి సిద్ధపడినట్లు, వారు సదరు విషయాన్ని సెటిల్ చేసుకోవాలనుకుంటే డబ్బులు కట్టాలని భయభ్రాంతులకు గురి చేయగా అందులో మండలంలోని ఎలమవారిపాలెం గ్రామ విఆర్వో గా పని చేస్తున్న యేసయ్య సదరు వ్యక్తి గుర్తుతెలియని ACB వ్యక్తి మాటలకు భయపడి వారి బంధువుల నెంబర్ నుండి Rs.1,50,000 ఫోన్ పే ద్వారా పంపినాడు.ఈ విషయమై విఆర్వోలు అందరూ కలసి మండల ఎమ్మార్వో రవి నాయక్ కు ఫిర్యాదు చేయగా మండల ఎమ్మార్వో ఫిర్యాదు మేరకు బల్లికురవ పోలీస్ స్టేషన్లో cyber crime case నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story