Dornala: విద్యుత్ సరఫరా కోసం సబ్స్టేషన్ వద్ద రైతుల నిరసన!
Dornala: దోర్నాల మండలం అయినముక్కలలో విద్యుత్ అంతరాయంపై రైతులు ఆందోళన చేపట్టారు. పంటలు ఎండిపోతున్నాయని, రోజుకు 9 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
Dornala: విద్యుత్ సరఫరా కోసం సబ్స్టేషన్ వద్ద రైతుల నిరసన!
Dornala: మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని అయినముక్కల గ్రామ రైతులు విద్యుత్ సరఫరాలో అంతరాయంపై ఆందోళన చేపట్టారు. వ్యవసాయ పొలాలకు రోజుకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాల్సి ఉండగా, గత వారం రోజులుగా సక్రమంగా విద్యుత్ సరఫరా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని, నాట్లు వేసేందుకు తెచ్చిన మొక్కలు వాడిపోతున్నాయని వాపోయారు. విద్యుత్ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేకపోవడంతో విద్యుత్ ఉపకేంద్రం వద్ద నిరసన తెలిపారు.
విద్యుత్ అంతరాయంతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి వ్యవసాయానికి రోజుకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి, తమ పంటలను కాపాడాలని రైతులు కోరారు.




