Markapur: జులై 30 లోపు పీఎం సూర్య ఘర్ లక్ష్యాలు పూర్తి చేయాలి

Markapur: మార్కాపురం జిల్లాలో పీఎం సూర్య ఘర్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటు లక్ష్యాన్ని జూలై 30 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 13 May 2026 8:06 PM IST
Markapur
X

Markapur: జులై 30 లోపు పీఎం సూర్య ఘర్ లక్ష్యాలు పూర్తి చేయాలి

Markapur: మార్కాపురం జిల్లాలో పీఎం సూర్య ఘర్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటు లక్ష్యాన్ని జూలై 30 వ తేది లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత విద్యుత్ శాఖ అధికారులు, ఏజెన్సీ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో పీఎం సూర్య ఘర్ లక్ష్యాలపై వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకంపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. మెటీరియల్, కావలసినంత సిబ్బందిని ఏర్పాటు చేసుకొని లక్ష్యానికి అనుగుణంగా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

టార్గెట్లు పూర్తి చేయని ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామని కలెక్టర్ హెచ్చరించారు. సోలార్ ఏర్పాటు వల్ల ఉపయోగాలు, ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకాన్ని ఉపయోగించుకునే విధంగా చూడాలన్నారు. జనరల్ కేటగిరిలో ఈ లక్ష్యం జిల్లాలో 3వేలు ఉండగా ఇప్పటికీ 169 మాత్రమే పూర్తి చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రెండు కిలో వాట్ల సామర్థ్యంతోఉచితంగా ఏర్పాటు చేసే సోలార్ ప్యానళ్ల ఏర్పాటు లక్ష్యం 12,342 ఉండగా ఇప్పటికీ 1810 మాత్రమే పూర్తి చేయటం ఏంటని వారిని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి త్వరితగతిన లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ కె. వెంకటేశ్వర్లు, మార్కాపురం, కనిగిరి ఈఈ లు నాగేశ్వరరావు, ఉమాకాంత్, ఏడీలు షియా నాయక్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story