Markapuram: తొలిసారిగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

Markapuram: మార్కాపురం నూతన జిల్లా కేంద్రంలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులతో సమీక్షించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 11 Aug 2026 11:48 PM IST
Markapuram
X

Markapuram: తొలిసారిగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

మార్కాపురం: మార్కాపురం నూతన జిల్లా కేంద్రంలో తొలిసారిగా నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా, వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.

ఎస్వీకేపీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

తాగునీరు, పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, నీడ, విద్యార్థులకు స్నాక్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిబింబించే శకటాలు, స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వెలిగొండ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుందని కలెక్టర్ తెలిపారు. నిర్వాసితుల పునరావాసానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక వసతులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ల పంపిణీని కూడా మరింత వేగవంతం చేయాలని సూచించారు.

జిల్లా ప్రజలందరూ తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ విజయ సునీత పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) సుబ్బారావు, డ్వామా పీడీ సువార్త, ఐసిడిఎస్ ఇంచార్జ్ పీడీ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మార్కాపురం తహసీల్దార్ చిరంజీవితో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story