Giddalur: గిద్దలూరులో రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరులో నిబంధనలు పాటించని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేసి నిల్వ చికెన్‌ను ధ్వంసం చేశారు.
Giddalur: గిద్దలూరులో రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు!
మార్కాపురం: మార్కాపురం జిల్లా గిద్దలూరులో పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. గతంలో విఆర్ గ్రాండ్ రెస్టారెంట్‌పై ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఒంగోలు నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గిద్దలూరు మున్సిపల్ అధికారుల సహకారంతో రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించింది. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులు పరిశీలన చేపట్టారు.
తనిఖీల్లో పలు రెస్టారెంట్లలో చికెన్‌ను ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అయితే వాటి కొనుగోలు తేదీ, గడువు వివరాలతో కూడిన లేబుళ్లు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాలకు సంబంధించిన కొనుగోలు బిల్లులను తప్పనిసరిగా భద్రపరచాలని సూచించారు. ఫ్రిజ్‌లలో ఆహార పదార్థాలను అధికంగా నిల్వ చేయరాదని, రెస్టారెంట్ వంటగదులను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
పలు రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన చికెన్, గతంలో నిర్వహించిన చికెన్ వంటకాలను అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేయించారు. హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు పరిశుభ్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఆహారం అందించే సమయంలో శుభ్రతా నియమాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. కస్టమర్లతో మర్యాదగా వ్యవహరించాలని కూడా అధికారులు తెలిపారు.
ఇకపై రెస్టారెంట్లపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.




