Addanki: అద్దంకిలో మున్సిపల్ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
Addanki: అద్దంకి మున్సిపల్ ఎన్నికల కోసం 32 వార్డుల్లో 49 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
Addanki: అద్దంకిలో మున్సిపల్ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రకాశం జిల్లా, అద్దంకి: అద్దంకి మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఉప కలెక్టర్ డి. హిమ వంశీ తెలిపారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల విధుల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులను నియమించినట్లు తెలిపారు.
అద్దంకి పట్టణ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి మొత్తం 49 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.పోలింగ్ కేంద్రాలను ఆరు రూట్లుగా విభజించి, ప్రతి రూట్‌కు అవసరమైన సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
ఎన్నికల ప్రక్రియను సీసీ కెమెరాలు, వీడియో గ్రాఫర్ల ద్వారా నిరంతరంపర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టినట్లు వెల్లడించారు.
ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఉప కలెక్టర్ బి. హేమ వంశీ కోరారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి. రవీంద్ర పాల్గొన్నారు.




