Markapuram: మార్కాపురంలో అటవీ శాఖ స్వచ్ఛతా డ్రైవ్
Markapuram: మార్కాపురంలో ఘనంగా ‘స్వచ్ఛ్ గావ్ – సురక్షిత్ జలవాయు’ కార్యక్రమం.
Markapuram: మార్కాపురంలో అటవీ శాఖ స్వచ్ఛతా డ్రైవ్
మార్కాపురం: డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవుఫ్ ఆదేశాల మేరకు “స్వచ్ఛ్ గావ్ – సురక్షిత్ జలవాయు” కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మార్కాపురం ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది, మార్కాపురం డివిజన్ కార్యాలయ సిబ్బంది, కాటంరాజు బేస్ క్యాంప్, కలనూతల బేస్ క్యాంప్, నాగులవరం సెక్షన్‌కు చెందిన ప్రొటెక్షన్ వాచర్లు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్. పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం డీడీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరిచారు. కార్యాలయం ముందు ఉన్న మురికి కాలువలో పేరుకుపోయిన చెత్త, మురుగును తొలగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించారు.
ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, గుంటక వనజాక్షి, కృష్ణారావు, రవి, చిన్న కృష్ణ గౌడ్‌తో పాటు సంస్థ సభ్యుల సేవలను డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవుఫ్ అభినందించారు. సమాజ హితానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో తమ సంస్థ సభ్యులు చురుకుగా పాల్గొంటారని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు గుంటక సుబ్బారెడ్డి ,గుంటక వనజాక్షి, కృష్ణారావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్. పిచ్చిరెడ్డి, ఏఓ ఖాజా మొహిద్దీన్, ఏఓ చంద్రమౌళి, డీవైఆర్ఓలు జి. నాగరాజు, ఎం. ప్రసాదరెడ్డి, బీట్ ఆఫీసర్లు, అటవీ శాఖ సిబ్బంది, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.




