Chirala: చీరాలలో టీడీపీలో చేరిన మాజీ కౌన్సిలర్లు!
Chirala: బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్లు చిలుకోటి శ్రీనివాసరావు మరియు కాటా ప్రసాద్.
Chirala: చీరాలలో టీడీపీలో చేరిన మాజీ కౌన్సిలర్లు!
Chirala: చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరికల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో చీరాల మున్సిపాలిటీకి చెందిన మాజీ కౌన్సిలర్లు చిలుకోటి శ్రీనివాసరావు, కాటా ప్రసాద్ బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. చీరాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మద్దులూరి మహేంద్ర నాథ్ వారికి టీడీపీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్లు చిలుకోటి శ్రీనివాసరావు, కాటా ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్ లు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




