Dornala: కొర్రపోలులో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ!
Dornala: మార్కాపురం జిల్లా కొర్రపోలులో ఉచిత మెగా వైద్య శిబిరం.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.
Dornala: కొర్రపోలులో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ!
Dornala: మార్కాపురం జిల్లాదోర్నాల ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాల్లో భాగంగా దోర్నాల మండలం కొర్రపోలు గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రారంభించారు. ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లీ ఫార్మా సంస్థ సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల సలహాలు అందించారు. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు అవకాశాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గూడూరు ఏరిక్షన్ బాబు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు షేక్ మహబూబ్, కూటమి నాయకుడు తంగిరాల అశోక్ రెడ్డి, భాజపా రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి, ట్రస్ట్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




