Markapur: కొర్రపోలులో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు, వైద్య శిబిరం!

Markapur: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొర్రపోలులో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.. బీజేపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 15 Sept 2026 7:37 PM IST
Markapur
X

Markapur: కొర్రపోలులో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు, వైద్య శిబిరం!

Markapur: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న దోర్నాల మండలం కొర్రపోలు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి, ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు.

లీ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించే ఈ శిబిరంలో పేదలు, గిరిజనులకు ఉచిత వైద్య పరీక్షలు, నిపుణుల వైద్యుల సలహాలు, చికిత్స, మందుల పంపిణీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

అంత్యోదయమే లక్ష్యంగా అట్టడుగు వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ట్రస్ట్ ఉద్దేశమని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు. కొర్రపోలు, పరిసర ప్రాంతాల ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM