Giddalur: గాంధీ, శాస్త్రి ఆశయాలు నేటి తరానికి ఆదర్శం: జాడి శ్వేత

Giddalur: గిద్దలూరులో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఏపీ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి శ్వేత ఘన నివాళులర్పించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 2 Oct 2026 3:13 PM IST
Giddalur
X

Giddalur: గాంధీ, శాస్త్రి ఆశయాలు నేటి తరానికి ఆదర్శం: జాడి శ్వేత

మార్కాపురం జిల్లా: గిద్దలూరు, జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా గిద్దలూరులో బీసీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, వారి సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి స్వేత మాట్లాడుతూ, మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి మార్గాలతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో చూపాలని పిలుపునిచ్చారు.

దేశానికి జై జవాన్–జై కిసాన్” నినాదాన్ని అందించిన లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, నిజాయతీ, ధైర్యం, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. అధికారం అంటే హోదా కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని శాస్త్రి తన జీవితంతో నిరూపించారని తెలిపారు.

ప్రస్తుత రాజకీయాల్లో గాంధీజీ సత్యనిష్ఠ, శాస్త్రిజీ నిరాడంబరత అత్యంత అవసరం. పదవుల కోసం రాజకీయాలు చేసే నాయకులు కాకుండా, ప్రజల కోసం పనిచేసే సేవకులు దేశానికి కావాలి. బడుగు, బలహీన, బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే మహనీయులకు మనం అర్పించే నిజమైన నివాళి” అని జాడి శ్వేత పేర్కొన్నారు.

యువత మహనీయుల జీవిత చరిత్రలను అధ్యయనం చేసి, క్రమశిక్షణ, నిజాయతీ, సేవాభావం, దేశభక్తిని అలవరచుకోవాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో స్ప్రింగ్ బోర్డ్ స్కూల్ డైరెక్టర్ పి.మణి చైతన్య, గిద్దలూరు పట్టణ బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షుడు అద్దంకి. మధుసూధనరావు,శాలివాహన సంఘ నాయకులు దగ్గుపాటి. శేఖర్, నాగేళ్ల.వెంకట మోహన్,విశ్వబ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడు బంగారు.శ్రీనివాసాచారి,గలిజెరుగుళ్ల.విశ్వరూపాచారి,నాయి బ్రాహ్మణ సంఘ సెక్రటరీ రావిపాటి. నాగరాజు,రజక సంఘ వైస్ ప్రెసిడెంట్ అలసందలపల్లె.పాండు, బి.సి. నాయకుడు కోడె.అల్లురయ్య యాదవ్, పలువురు బీసీ సంఘ నాయకులు,బి.సి. మహిళా నాయకులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU