Giddalur: త్రిపురాపురంలో తీవ్ర నీటి ఎద్దడి.. బిందెలతో మహిళల నిరీక్షణ
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలం త్రిపురాపురంలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి కష్టాలు; ట్యాంకుల వద్ద మహిళల బారులు.
Giddalur: త్రిపురాపురంలో తీవ్ర నీటి ఎద్దడి.. బిందెలతో మహిళల నిరీక్షణ
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లోని కొమరోలు మండలం త్రిపురాపురం (గుమ్మల పల్లె) గ్రామంలో నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు ఎల్ నినో ప్రభావంతో గిద్దలూరు నియోజకవర్గం లోని ఆరు మండలాల్లో వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లలో నీరు అంతంత మాత్రమే వస్తుండటంతో తాగు నీటి కోసం స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామంలోని నీళ్ల ట్యాంక్ కుల వద్ద బిందెలు బారులు తీరి గంటల తరరబడి మహిళలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది, దీంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలని నీటి సమస్యను తీర్చాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.




