Giddalur: పోలింగ్ సిబ్బందికి ఆర్వో కీలక మార్గదర్శకాలు
Giddalur: గిద్దలూరు ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ. నిబంధనలు విధిగా పాటించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పష్టమైన ఆదేశాలు.
Giddalur: పోలింగ్ సిబ్బందికి ఆర్వో కీలక మార్గదర్శకాలు
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ సంబంధించి సిబ్బందిని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఎవరణలో రిటర్నింగ్ అధికారి ఎన్నికల సిబ్బందికి విధి విధానాలపై పలు సూచనలు చేశారు.
ఎన్నికల సామగ్రిలో బ్యాలెట్ బాక్సులు, పత్రాలు తదితర సామగ్రిని సిబ్బందికి అందజేయడం జరిగింది.ఎన్నికల సామగ్రిని భద్రంగా చూసుకోవాలని నీరు , సిరా మరకలు తగలకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఎన్నికల నిబంధనలను పాటించాలని ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు సిబ్బంది సహకరించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు స్థానిక పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.




