Giddalur: ప్రభుత్వ ఖాజీ తొలగింపు జీవో నంబర్ 30 విడుదలపై హర్షం!
Giddalur: అవినీతి ఆరోపణల నేపథ్యంలో గిద్దలూరు మండల ప్రభుత్వ ఖాజీ నాయబ్ రసూల్ను తొలగిస్తూ ప్రభుత్వం జీవో 30 జారీ చేసింది. ముస్లిం మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు.
Giddalur: ప్రభుత్వ ఖాజీ తొలగింపు జీవో నంబర్ 30 విడుదలపై హర్షం!
గిద్దలూరు: ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ సంఘం వారు GO MS No 30. 1/10/2026 నా గిద్దలూరు మండల ఖాజీ గా నాయబ్ రసూల్ నూ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది. Go నందు పలు అంశాలను ప్రస్తావిస్తూ 20 22 నా నాయబ్ రసూల్ చేసిన అవినీతి ఆరోపణలపై పూర్తిగా పరిశీలించి గిద్దలూర పట్టణంలో చేపట్టిన విచారణలను దృష్టిలో ఉంచుకొని 1/10/2026 తేదీన నాయబ్ రసూల్ ప్రభుత్వ ఖాజీగా గిద్దలూరు మండలంనకు తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
ఈ విషయంపై గిద్దలూరు పట్టణంలోని నూరాణి మసీద్ నందు మత పెద్దలు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయము పై హర్షం వ్యక్తం చేసినారు మరియు ముస్లిం పెద్దలు సమావేశం నందుGO ms no 30 ప్రతులను ప్రదర్శించడమైనది.
ఈ కార్యక్రమంలో మత పెద్దలు షేక్ గుడిసె మా భాష, ఖాదర్ ఖాన్, p. సనావుల్లా ఖాన్,p .అమానుల్లా ఖాన్, షేక్ దాదా పీరా, షేక్ సయ్యద్, మిద్దె మస్తాన్వలి, షేక్ హనీఫ్, బాబు ఖాన్,RTD pt sir, షేక్ సయ్యద్ పలువురు మత పెద్దలు ముస్లిం నాయకులు పాల్గొనడం జరిగింది.




